News September 26, 2024
ఖైరతాబాద్: బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

గురుకుల విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురుకులాలు బీసీ హాస్టళ్లు మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం అందించాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
Similar News
News October 31, 2025
PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్‌తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.
News October 30, 2025
సజ్జనార్ ఆకస్మిక తనిఖీ: సాంకేతికత వాడకంపై ఆదేశం

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం బంజారాహిల్స్‌లోని కమిషనర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిన్, ఐటీ, కంట్రోల్ రూమ్ సహా వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. పీసీఆర్‌లో ఇంటిగ్రేటెడ్ పెట్రోలింగ్ సిస్టమ్, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయంపై ఆరా తీశారు. సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. విధుల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలన్నారు
News October 30, 2025
BREAKING: తుఫాన్ ఎఫెక్ట్.. HYD శివారులో మహిళ మృతి

మొంథా తుఫాను కారణంగా HYD శివారులో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మజీద్‌పూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


