News September 4, 2024

ఖైరతాబాద్: వరద నష్టాలపై వారాంతంలోగా వివరాలివ్వాలి

image

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని సీఎస్ శాంతి కుమారి అన్ని శాఖలను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి వివరాలు సేకరించి నివేదికలు సమర్పించాలి. ప్రతి జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.

Similar News

News November 7, 2025

HYD: KTR.. రాసిపెట్టుకో..!: కాంగ్రెస్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRS పార్టీ పతనానికి రెఫరెండమని, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరంకొట్టారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ మీ సీటు గాయబే.. ఇక్కడి నుంచి మీ పార్టీ కనుమరుగు కావడం ఖాయం.. రాసిపెట్టుకో KTR’ అని పేర్కొంది. కాగా జూబ్లీహిల్స్‌లో BRS గెలవదని, కచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్స్: రూ.3.33 కోట్లు సీజ్

image

ఎన్నికలంటే మాటలా.. మొత్తం డబ్బుతోనే పని.. అందుకే నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు తరలిస్తుంటారు. అలా వివరాలు లేక పట్టుబడిన డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3.33 కోట్లను సీజ్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే వివరాలు చెప్పిన వారికి డబ్బు తిరిగి ఇస్తున్నామని పేర్కొన్నారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: అధిష్టానం చూస్తోంది బాసూ..!

image

ఒక్క హైదరాబాదు వాసులే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారు. అంతేకాదు ఆయా పార్టీల అధిష్ఠానాలు కూడా ఈ ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నాయి. ఎలాగైనా గెలిచి ఢిల్లీలో తమ సత్తా ఏంటో చూపించాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరాటపడుతున్నారు. కేటీఆర్ మాత్రం గెలిచి KCRకు ఈ విజయం బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక్కడ పట్టుకోసం, ఢిల్లీలో పరువు కోసం నాయకులు పాకులాడుతున్నారు.