News February 13, 2026
గంగవరం: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా..?

గంగవరం పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు రైడ్ చేసి లంచం తీసుకుంటుండగా ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబును అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే కొందరు లోపాయకారి ఒప్పందాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలవరం జిల్లాలో ఇటీవల మొదటి పోస్టింగ్‌లో నలుగురు ఎస్సైలు బాధ్యతలు స్వీకరించారు. వారు మినహా మిగిలిన వారిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Similar News
News March 14, 2026
ప.గో: భార్య గొంతు కోసిన భర్త

భార్య గొంతును బ్లేడుతో కోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. కరగాని దిల్లేశ్వరి భర్త గోవిందు మధ్య మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆమె పని చేస్తున్న డ్రై ఫ్రూట్స్ షాపు వద్దకు వచ్చి తనను బండిపై ఇంటికి తీసుకు వెళ్లాలని కోరాడు. ఆమె బండి నడుపుతుండగా వెనక కూర్చున్న గోవిందు తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో పీక కోసి పరారయ్యాడు.
News March 14, 2026
రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. BRS నుంచి వచ్చిన జగిత్యాల MLA సంజయ్‌కి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైరం ముదిరింది. దీనిపై జీవన్ రెడ్డి Way2Newsతో మాట్లాడుతూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరించినా లాభం లేదని వాపోయారు.
News March 14, 2026
నెతన్యాహు చనిపోయారా?

ఇరాన్‌తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.


