News February 11, 2025

గంగవరం: ఎస్సై కుటుంబానికి సాయం

image

రివాల్వర్‌తో కాల్చుకుని గంగవరానికి చెందిన తణుకు ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి ఆయన స్నేహితులు రూ. 45.68 లక్షల సాయం చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఇటీవల తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన స్నేహితులు కలిసి రూ. 45.68 లక్షల ఆర్థిక సహాయాన్ని మూర్తి భార్య విజయకు చెక్కు రూపంలో సోమవారం అందజేశారు.

Similar News

News November 3, 2025

చిత్తూరు: ఆధార్ అప్‌ డేట్ గడువు పెంపు

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ను 6వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు.

News November 3, 2025

పాపికొండల బోటింగ్ షురూ

image

AP: పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. వాస్తవానికి దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది.

News November 3, 2025

భక్తులారా.. అప్రమత్తంగా ఉండండి.!

image

నేడు కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తులు తలకోన, మూలకోన, సదాశివకోన, కోనమల్లేశ్వర స్వామితో పాటు ఇతన కొండాకోనలకు తరలి వెళ్లే అవకాశం ఉంది. మరికొందరు బీచ్‌ల వద్ద పూజలు చేయడానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో అక్కడ భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరారు. తొక్కిసలాటకు తావు లేకుండా నడుచుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.