News July 14, 2024

గంగాడ గ్రామంలో వివాహిత హత్య

image

బలిజిపేట మండలంలో వివాహిత మృతదేహం కలకలం రేపింది. గంగాడ గ్రామానికి చెందిన సావిత్రి (56) మిస్సింగ్‌కు సంబంధించి కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆమె భర్త, కొడుకు కలిసి హత్య చేశారని మృతురాలి మేనల్లుడు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 14, 2024

నేడు పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం

image

భక్తుల కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మొదలయ్యే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగుస్తుంది. రేపు సిరిమానోత్సవం జరగనుండగా 2 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పైడితల్లి జాతర నేపథ్యంలో నేడు, రేపు విజయనగరంలో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు సీఐ మన్మథరావు తెలిపారు.

News October 14, 2024

VZM: డ్రాలో ఎంపికయ్యే వారికి కీలక సూచనలు

image

మద్యం షాపులకు కలెక్టరేట్‌లో సోమవారం లాటరీ ప్రక్రియ జరగనున్న సంగతి తెలిసిందే. లాటరీలో ఎంపికయ్యే వారికి అబ్కారీ శాఖ సూపరిండెంటెండ్ శ్రీనాధుడు కీలక సూచనలు చేశారు. ఒక్కో షాపుకు ఒక్కో అభ్యర్థిని ఎంపిక చేస్తామని, వారితో పాటు మరో ఇద్దరు రిజర్వుడు అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తామన్నారు. అసలు వ్యక్తి 24 గంటల్లోగా 6వ వంతు లైసెన్స్ ఫీ చెల్లించాల్సి ఉందని, లేకపోతే రిజర్వు అభ్యర్థులకు షాపులు కేటాయిస్తామన్నారు.

News October 13, 2024

VZM: మూడు స్లాట్లలో లాటరీ ప్రక్రియ

image

మూడు స్లాట్లలో మద్యం లాటరీ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8-10 గంటల వరకు మొదటి స్లాట్‌లో 50 షాపులు, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 51 నుంచి 100 షాపుల వరకు(2వ స్లాట్), మధ్యాహ్నం 12 గంటల నుంచి 101 నుంచి 153 షాపుల వరకు(3వ స్లాట్)లో లాటరీ ప్రక్రియ జరగనుంది. లాటరీ ప్రక్రియ నిర్వహణ కోసం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్‌లో ఒక తహశీల్దార్, ఎస్.హెచ్.ఓ ఉంటారు.