News February 6, 2025
గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.
Similar News
News November 23, 2025
వరి, పత్తి పంటల్లో బోరాన్ లోపం ఇలా గుర్తించండి

☛ వరి: బోరాన్ లోపం వల్ల వరి లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. వరి పొట్ట దశ నుంచి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపడక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. ☛ పత్తి: లేత చిగుర్లు చిగురించవు. మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్లుతున్నట్లు కనిపిస్తాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి.
News November 23, 2025
విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.
News November 23, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో (కలెక్టరేట్) ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు.


