News February 6, 2025
గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.
Similar News
News January 9, 2026
దేవదాయశాఖ భూముల పరిరక్షణ అధికారులదే బాధ్యత: కలెక్టర్

దేవదాయశాఖ భూముల పరిరక్షణ బాధ్యత అధికారులదేనని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవదాయ భూముల దస్త్రాలను పకడ్బందీగా ఉంచాలన్నారు. సర్వే నంబర్లు లేని దేవాలయాలు, సత్రాలకు ప్రత్యేక ఖాతాలు దాఖలు చేయాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూముల సమస్యలను రెవెన్యూ, దేవదాయ శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
News January 9, 2026
భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

బీబీనగర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ హనుమంత రావు, భూభారతి కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలు, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.
News January 9, 2026
అయోధ్యలో నాన్-వెజ్ నిషేధం

అయోధ్య, పంచకోషీ యాత్ర రూట్లలో నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు UP ప్రభుత్వం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లలో నాన్-వెజ్ పదార్థాల తయారీ, అమ్మకాలపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొంతమంది టూరిస్టులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తింటున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఆన్లైన్ డెలివరీలపైనా నిషేధం విధించింది.


