News March 21, 2025
గంగానమ్మ స్థలాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి

నూజివీడులోని కృష్ణ బడ్డీ కొట్టు సెంటర్లో గంగానమ్మ రావిచెట్టు వద్ద ఓ వ్యక్తి విధ్వంసం సృష్టిస్తున్నాడని సమాచారం రావడంతో పట్టణ పోలీసులు శుక్రవారం ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అమెరికాలో MS చదివిన ఎడవల్లి రవిచంద్ర (30) అనే యువకుడికి మతిస్థిమితం లేదని స్థానికుల అంటున్నారు. శుక్రవారం గంగానమ్మను పెట్టి పూజిస్తున్న స్థలాన్ని గడ్డ పలుగుతో పగలగొడుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.
Similar News
News December 3, 2025
NLG: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 269 గ్రామాలకు, 2,206 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
News December 3, 2025
యుద్ధానికి మేము సిద్ధం: పుతిన్

గతంలో చెప్పినట్లు యూరప్ దేశాలతో యుద్ధం చేయాలని రష్యా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఒకవేళ తమపై పోరాటం చేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ వార్ ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలు తెచ్చి శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు. వాటికి శాంతియుత ఎజెండా లేదని ఆరోపించారు.
News December 3, 2025
MGU బీటెక్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు అలెర్ట్

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును డిసెంబర్ 8 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పొడిగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షల టైమ్ టేబుల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు.


