News March 21, 2025
గంగానమ్మ స్థలాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి

నూజివీడులోని కృష్ణ బడ్డీ కొట్టు సెంటర్లో గంగానమ్మ రావిచెట్టు వద్ద ఓ వ్యక్తి విధ్వంసం సృష్టిస్తున్నాడని సమాచారం రావడంతో పట్టణ పోలీసులు శుక్రవారం ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అమెరికాలో MS చదివిన ఎడవల్లి రవిచంద్ర (30) అనే యువకుడికి మతిస్థిమితం లేదని స్థానికుల అంటున్నారు. శుక్రవారం గంగానమ్మను పెట్టి పూజిస్తున్న స్థలాన్ని గడ్డ పలుగుతో పగలగొడుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.
Similar News
News April 20, 2025
ములుగు: రాజీవ్ యువ వికాసం పథకానికి 4,698 దరఖాస్తులు

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి 4,698 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఏటూరునాగారం 415, గోవిందరావుపేట 541, కన్నాయిగూడెం 247, మల్లంపల్లి 126, మంగపేట 563, ములుగు 863, తాడ్వాయి 504, వెంకటాపూర్ 249, వెంకటాపురం 520, వాజేడులో 670 మంది వివిధ యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
News April 20, 2025
గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
ADB ITI కళాశాలలో రేపు అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ అందజేస్తామన్నారు.