News February 7, 2025

గంగాపూర్ జాతర పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

image

మండలం గంగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర పనులను నేడు జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యాలను వాహనాల పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. జాతరలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక టాయిలెట్ బాత్రూమ్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు. వీరితో ఏఎస్పీ చిత్తరంజన్ దాస్, డిఎస్పీ కరుణాకర్ ఉన్నారు. 

Similar News

News November 23, 2025

హనుమకొండ: బహుమతులను అందజేసిన మంత్రి, ఎమ్మెల్యేలు

image

11వ తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News November 23, 2025

ఏలూరు కలెక్టరేట్‌లో సత్యసాయి జయంతి ఉత్సవాలు

image

ఏలూరులోని గౌతమీ సమావేశ మందిరంలో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు హాజరై.. బాబా చిత్రపటానికి పూలమాలలు వేశారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంతకాలం సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారని, ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

News November 23, 2025

రేపటి నుంచి అంతర్ జిల్లాల ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం

image

AP పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న 69వ అంతర్ జిల్లాల SGF-17 బాల బాలికల ఫెన్సింగ్ టోర్నమెంట్ సోమవారం నుంచి ఈనెల 26 వరకు సఖినేటిపల్లి మండలం మోరిలోని జాన సుబ్బమ్మ మెమోరియల్ హైస్కూల్ వద్ద నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు కిషోర్ కుమార్, యం.వేంకటేశ్వరరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. 3 రోజులు ఈ ఈవెంట్‌కు ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు హైస్కూల్ GHM శ్రీధర్ కృష్ణ తెలిపారు.