News October 23, 2024
గంగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న MLC, ప్రభుత్వ విప్
MLC జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, జాబితాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి మంగళవారం ఉదయం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గంగారెడ్డి పార్థివ దేహానికి MLC జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అనంతరం గంగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కాగా, గంగారెడ్డి హత్యతో జగిత్యాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Similar News
News November 4, 2024
భీమదేవరపల్లి: తండ్రిని వదిలేసిన కొడుకు.. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు
తండ్రి ఫిర్యాదుతో కొడుకుకు చేసిన భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్‌లో మద్దెల రాజకొంరయ్య 4.12 ఎకరాలు 2018లో కొడుకు రవికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు. అతను తండ్రిని వదిలేయడంతో సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద పిటిషన్ ఫైల్ చేశారని భీమదేవరపల్లి తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి తిరిగి తండ్రికి భూమి పాస్‌బుక్ అందించారు.
News November 4, 2024
చిమ్మచీకట్లో.. కరీంనగర్ రైల్వేస్టేషన్
కరీంనగర్ రైల్వే స్టేషన్లో అధికారుల నిర్లక్ష్యంతో అంధకారం నెలకొంది. ఆదివారం రాత్రి తిరుపతికి వెళ్లాల్సిన ప్రయాణికులు చీకట్లో పడరాని పాట్లు వడ్డారు. ఫ్లాట్‌ఫామ్‌కు కేవలం ఒక్కటే ఫ్లాడ్ లైట్ ఉండటంతో దూరంగా ఉన్న రైలు బోగీలోకి ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో ఆధునీకరణ పనుల్లో భాగంగా సరఫరా నిలిపివేశారు. దీంతో రైల్వే స్టేషన్ అంధకారం నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
News November 3, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,62,638 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.2,13,973, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,03,600, అన్నదానం రూ.45,065, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.