News October 29, 2024
గంగారెడ్డి హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి ఈనెల 22న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవరం మంత్రి శ్రీధర్ బాబు.. మృతుడు గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పని చేసిన గంగారెడ్డి హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Similar News
News November 2, 2025
HZB: ‘లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధం’

హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య, సౌకర్యాలను పరిశీలించి వైద్యులతో చర్చించారు. ఆడపిల్లల పుట్టుకపై తల్లిదండ్రులు ఎలాంటి తారతమ్యాలు చూపరాదని ఆమె సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధితమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 2, 2025
కరీంనగర్ : ఈనెల 15న లోక్ అదాలత్

కరీంనగర్, హుజూరాబాద్ కోర్టుల పరిధిలో ఈనెల 15న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేష్ తెలిపారు. లోక్ అదాలత్‌లో చెక్ బౌన్స్, క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News November 2, 2025
తిమ్మాపూర్: 41 ఏండ్ల సర్వీస్.. స్కూల్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

తిమ్మాపూర్ మండలం పొలంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 41 ఏండ్ల 8 నెలల సుదీర్ఘ సేవలు అందించిన ఎస్ఏ (సోషల్) టి. రమేష్ కుమార్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి వంగల శ్రీనివాస్, రమేష్ కుమార్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.


