News April 5, 2025
గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలి: ADB SP

జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.
Similar News
News April 7, 2025
ADB: మహిళల బంగారు పుస్తెల తాళ్లు చోరీ: CI

పండుగ సందర్భంగా గుడికి వెళ్లిన మహిళల మెడల్లో నుంచి పుస్తెల తాళ్లు చోరీ అయిన ఘటన ADBలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల మేరకు.. తిర్పల్లికు చెందిన ఠాకూర్ పద్మజ, మావలకు చెందిన సుమ బ్రాహ్మణ సమాజ్ రామమందిర్లో పూజకు వెళ్లారు. క్యూలైన్లో నిలబడి భోజనాలు చేశారు. అనంతరం చూసుకుంటే పద్మజ, సుమ మెడలోని బంగారు పుస్తెల తాళ్లు కనబడలేదు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 7, 2025
ADB: వారంలో 8 సైబర్ మోసాలు: SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, మొబైల్ హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఎటువంటి గుర్తు తెలియని స్కాం నంబర్లు, లింక్లు ఓపెన్ చేయొద్దన్నారు. సైబర్ క్రైమ్కు గురైతే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.
News April 7, 2025
బెట్టింగ్.. నలుగురి అరెస్ట్ : SP

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.