News August 22, 2024

గంజాయిని సమూలంగా నిర్మూలించే విధంగా చర్యలు చేపడతాం: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టే విధంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, పూర్తిగా గంజాయి నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం ఎస్పీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు రవాణా కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రణాళికతో ముందుకు వెళుతూ ప్రత్యేక టీములు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News January 19, 2026

రాష్ట్ర స్థాయి అధికారిగా మన అనంత జిల్లా వాసి

image

ఏపీ RTI కమీషనర్‌గా అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజుల ఆదెన్న మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈయన అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు.

News January 19, 2026

అనంత జిల్లా స్థాయి పోటీలు

image

జూనియర్, సీనియర్ విభాగాలలో అనంత జిల్లా స్థాయి మట్టి కుస్తీ పోటీలు (మల్ల యుద్ధం) మంగళవారం 20వ తేదీన పామిడిలోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో జరగనున్నాయి. క్రీడాకారులు మంగళవారం ఉ. 9:00 గంటలకు హాజరుకావాలని జిల్లా కార్యదర్శి ఎన్. వాణి, జిల్లా కోచ్ రాఘవేంద్ర, ఆర్మీ ఎన్ సెక్రటరీ నక్కల రామాంజనేయులు తెలిపారు. వచ్చే క్రీడాకారులందరూ ఆధార్ కార్డు, మూడు ఫొటోలు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు.

News January 19, 2026

ఇండియా క్యాంప్‌కు ఎంపికైన గుంతకల్లు క్రీడాకారిణి మానస

image

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్‌లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.