News July 30, 2024
గంజాయిపై ఉక్కుపాదం.. విజయవాడ పోలీసులపై డీజీపీ ప్రశంస
100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏర్పాటైన ‘యాంటి నార్కోటిక్ సెల్’ బృందాలు మంగళవారం 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాయని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సెల్ ద్వారా ఇప్పటివరకు 77 మందిని అదుపులోకి తీసుకుని 28 కేసులు నమోదు చేసి 185 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా గంజాయి కట్టడికై విజయవాడ పోలీసుల చొరవను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు.
Similar News
News November 26, 2024
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు: APSDMA ఎండీ
కృష్ణా: నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఉమ్మడి కృష్ణాతో పాటుగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీవర్షాలు పడతాయని ఆయన హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు.
News November 26, 2024
30కి కృష్ణా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా
కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేపథ్యంలో ఈనెల 27వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని 30వ తేదీకి మార్చారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక ఓ ప్రకటన విడుదల చేశారు. 30న జరిగే సమావేశానికి సభ్యులంతా విధిగా హాజరు కావాలని కోరారు.
News November 26, 2024
కృష్ణా: కాదంబరి కేసు వాయిదా
ముంబై నటి కాదంబరి కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పలువురు IPS ఆఫీసర్లు, పోలీసులు, లాయర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగ్గా.. కేసు విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది. కౌంటర్ వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో కేసు విచారణ వాయిదా పడింది.