News February 25, 2025
గంజాయి కేసులో పదేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

గంజాయి కేసులో ముద్దాయిలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టు తీర్పును ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2021 మే 20వ తేదీన అనకాపల్లి టౌన్ పరిధిలో 20 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు సోమవారం శిక్షను విధించిందని ఎస్పీ తెలిపారు.
Similar News
News December 4, 2025
MDK: ఎన్నికల దావత్‌కు.. అందరూ ఆహ్వానితులే!

గ్రామపంచాయతీ ఎన్నికలకు నగర మోగింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఐతే ఉమ్మడి మెదక్ జిల్లా గ్రామాల్లో ఎన్నికల దావత్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు తమ అనుచరులు తమవెంట ఉండాలని ప్రతి రోజు దావత్‌లు ఇస్తున్నారు. ఇక పల్లెల్లో ముక్క, చుక్కలకు కొదువ లేదు. ఉదయం టిఫిన్‌లతో సహా రాత్రి దావత్‌ల వరకు ఎలాంటి డొక లేకుండా అందరూ ఆహ్వానితులే.. అంటున్నారు. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది.
News December 4, 2025
వర్ధన్నపేట ఇన్‌ఛార్జి.. ఎర్రబెల్లి VS దాస్యం

బీఆర్‌ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు – దాస్యం వినయభాస్కర్ వర్గాల మధ్య విభేదాలు కలకలం రేపుతున్నాయి. ఇన్‌ఛార్జి బాధ్యతలపై ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బహిరంగమైంది. హసన్‌పర్తి, ఐనవోలు మండలాలపై హస్తక్షేపం విషయంలో నెలకొన్న అసంతృప్తి కారణంగా, జీపీ ఎన్నికల్లో పార్టీ సమన్వయంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది.
News December 4, 2025
‘మీ మొబైల్ – మీ ఇంటికి’

అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమం మొదలవుతోంది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, నేరుగా యజమానుల ఇంటి వద్దకే వెళ్లి అందించేందుకు ‘మీ మొబైల్ – మీ ఇంటికి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సేవలతో ప్రజలు పోలీస్ స్టేషన్‌కు పదేపదే రావాల్సిన అవసరం తప్పుతుంది. నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా మొబైల్‌లను ఎస్పీ అధికారులు తెలిపారు.


