News November 8, 2024
గంజాయి కేసులో 108మంది అరెస్ట్: శ్రీకాకుళం SP
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి, కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 37కేసులు నమోదు చేశామని, 108 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Similar News
News December 14, 2024
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ
టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీచేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. ఇటీవల కాలంలో జనసేన నాయకులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కాగా ఈ మేరకు టెక్కలి పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేశారు.
News December 14, 2024
టెక్కలి: భార్యభర్తలపై హత్యాయత్నం
టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన పిట్ట రాజేశ్వరి, పిట్ట రామ్మోహన్ దంపతులపై వారి సమీప బంధువులు ఇద్దరు కత్తితో హత్యాయత్నం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో భార్యాభర్తలపై దాడి జరిగినట్లు గ్రామస్థులు అంటున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనాపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
News December 14, 2024
శ్రీకాకుళం జిల్లాలో చలి పంజా ..!
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. చలిగాలుల ఉద్ధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రతకు తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణుకుతున్నారు. గ్రామాల్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకొని కాచుకుంటున్నారు. ఎండ వచ్చి చలి తీవ్రత తగ్గాకే పనులకు వెళ్తున్నారు. చలి తీవ్రతకు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.