News March 20, 2025

గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: అల్లూరి కలెక్టర్

image

అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనకు సంబంధిత శాఖలన్నీ కలసి కృషి చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం పాడేరులోని కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో ఎన్కార్డ్ (NCORD) సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ ద్వారా డ్రోన్ల సహాయంతో 20 సంవత్సరాల డేటా ఆధారంగా సుమారు 82 ఎకరాలలో గంజా సాగును గుర్తించామన్నారు. ఆయా రైతులకు గంజాయి వల్ల కలుగు నష్టాలు, దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 20, 2025

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

image

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.

News November 20, 2025

చెరకు పంటను ఇలా నరికితే ఎక్కువ లాభం

image

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.

News November 20, 2025

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరల వివరాలు

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటా కనిష్ఠ ధర రూ.3,976, గరిష్ఠ ధర రూ.7,330 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ.3,700, గరిష్ఠ ధర రూ.6,636 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా రూ.5,109, గరిష్ఠంగా రూ.5,924 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం చూపుతూ పంటలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.