News August 28, 2024
గంజాయి రవాణా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలి: డీఐజీ

గంజాయి రవాణా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో ఐదు జిల్లాల ఎస్పీలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గంజాయి రవాణా- నియంత్రణపై సమీక్షించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిని విచారించి ఇందులో ఎవరెవరు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములుగా ఉన్నారో గుర్తించాలన్నారు.
Similar News
News December 13, 2025
హెచ్పీవీని జాతీయ టీకాల జాబితాలో చేర్చాలి: విశాఖ సీపీ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్‌ను జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైతన్య స్రవంతి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు, హోంగార్డుల కుమార్తెలకు (9-14 ఏళ్లు) ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు త్వరలో బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
News December 13, 2025
నేడు AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం

AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం ‘వేవ్స్–2025’ను మహిళా సాధికారత థీమ్‌తో శనివారం నిర్వహించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధా మూర్తి, ఏయూ ఆలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు, GMR అధినేత జి.ఎం.రావు తదితరులు పాల్గొననున్నారు.
News December 12, 2025
విశాఖ నుంచి తిరుగుపయనమైన సీఎం

ఒకరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖకు శుక్రవారం వచ్చారు. విశాఖలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమై, పలు కంపెనీలకు మంత్రులు, అధికారులతో శంకుస్థాపన చేపట్టారు. అనంతరం వైజాగ్ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం తిరుగు పయనమయ్యారు. ఆయనకు ఎయిర్ పోర్ట్‌లో కూటమి నాయకులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.


