News April 3, 2024
గంజాయి వాడకంపై ఉక్కుపాదం: SP చందనా దీప్తి

నల్గొండ జిల్లాలో గాంజయి, డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విడుదల చేసిన గంజాయి, కల్తీ కల్లుని నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం అనే పోస్టర్ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపీడ అన్నారు.
Similar News
News December 4, 2025
నల్గొండ: నామినేషన్ల పక్రియ పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల మూడవ విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. క్లస్టర్ కేంద్రంలోని రిజర్వేషన్లు, ఫ్లెక్సీ మార్గదర్శకాలు, డిజిటల్ క్లాక్ వివరాలు తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్ను పరిశీలనలో తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.
News December 4, 2025
నల్గొండ: చలికాలంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లాలో దట్టంగా కమ్ముకునే పొగమంచు వలన రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ శ్రీశరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోవడంతో పాటు, ముందున్న వాహనాల దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని ఎస్పీ తెలిపారు.
News December 4, 2025
చండూరు: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు బరిలో నిలవడంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కావలి స్వాతి పోటీ చేస్తుండగా, కావలి శివాని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ ఉంటుందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.


