News April 3, 2024
గంజాయి వాడకంపై ఉక్కుపాదం: SP చందనా దీప్తి

నల్గొండ జిల్లాలో గాంజయి, డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విడుదల చేసిన గంజాయి, కల్తీ కల్లుని నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం అనే పోస్టర్ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపీడ అన్నారు.
Similar News
News April 18, 2025
పోచంపల్లితో వినోబా భావేకు విడదీయని అనుబంధం

ఆచార్య వినోబా భావేకు <<16135013>>పోచంపల్లితో <<>>విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా నిలిచిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబా భావే పేర్కొనడం విశేషం. వినోబా భావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.
News April 17, 2025
NLG: వానాకాలం సాగు అంచనా 11.60 లక్షల ఎకరాలు!

వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. దీనికి అవసరమైన ఎరువులు, విత్తనాల ప్రతిపాదనలు కూడా ఖరారు చేసిన వ్యవసాయ శాఖ.. కమిషనరేట్‌కు పంపించింది. గత వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటల సాగు కాగా ప్రస్తుత వానాకాలంలో అదనంగా సుమారు 10 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ప్రస్తుత వానాకాలంలో 11,60,389 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు ప్రణాళిక ఖరారు చేసింది.
News April 17, 2025
NLG: వివాహితపై హత్యాయత్నం.. 20 ఏళ్లు జైలు

వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.