News April 4, 2025
గంజాయి సాగు, రవాణా అరికట్టాలి: ఎస్పీ

స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. శుక్రవారం పాడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గంజాయి కేసుల్లో పరాయిలో ఉన్న ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు విస్తృతంగా వినియోగించి, గంజాయి సాగు, రవాణా అరికట్టాలని సూచించారు. డైనమిక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News November 22, 2025
షూటింగ్లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్లో శ్రద్ధా నటిస్తున్నారు.
News November 22, 2025
జగిత్యాల: నిరుద్యోగులకు రేపు జాబ్ మేళా

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం నవంబర్ 24న (ఆదివారం) ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు బి. సత్యమ్మ తెలిపారు. కృషి విజ్ఞాన్ హైదరాబాద్లో 67, గూగుల్ పేలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ 30 పోస్టులు ఉన్నాయన్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు హాజరు కావచ్చు. ఎంపికైన వారు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, చొప్పదండి, ధర్మారం వంటి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
News November 22, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు శనివారం ఇలా ఉన్నాయి. ములకలచెరువులో నాణ్యత గల టమాటా 10 కిలోలు రూ. 520, పుంగనూరులో రూ. 500, పలమనేరులో రూ.490, వీకోటలో రూ.520, కలికిరిలో రూ.510, మదనపల్లెలో రూ. 630 వరకు పలుకుతున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరల పెరుగుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


