News February 5, 2025
గంటల వ్యవధిలో యువతి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు

ఎంవీపీ పోలీస్ స్టేషన్కు ఒక యువతి తప్పిపోయినట్లు మంగళవారం ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించి టెక్ సెల్, సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సదరు యువతిని పీఎం పాలెంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంటల వ్యవధిలో తప్పిపోయిన యువతి ఆచూకీ కనుగొన్న ఎంవీపీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.
Similar News
News December 6, 2025
విశాఖ: క్రికెట్ ఫ్యాన్స్కు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలివే

భారత్-దక్షిణాఫ్రికా వన్డే సందర్భంగా విశాఖ పోలీసులు పార్కింగ్ మార్గదర్శకాలు విడుదల చేశారు. వీఐపీలు NH-16 ద్వారా నేరుగా స్టేడియానికి చేరుకోవాలి. నగరం నుంచి వచ్చే వారు సాంకేతిక కాలేజీ వద్ద, శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్, మిధిలాపురి వద్ద పార్క్ చేయాలి. బీచ్ రోడ్ నుంచి వచ్చే వారికి MVV సిటీ, ఆర్టీసీ బస్సులకు లా కాలేజీ వద్ద స్థలం కేటాయించారు.
News December 6, 2025
సింహాచలం: కళ్యాణ మండపంలో తల్లి, కొడుకు ఆత్మహత్య

సింహాచలం కొండ కింద దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపంలో తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆధార్ కార్డు ప్రకారం గాజువాకకు చెందిన నీలావతి, అయ్యప్పంజన్గా గుర్తించారు. ఇద్దరూ దేవస్థానం కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం రూమ్ తీసుకున్నారు. రూములో ఉరివేసుకోవడంతో దేవస్థానం సిబ్బంది గమనించి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఘటనా స్థలికి చేరుకొని మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు.
News December 6, 2025
విశాఖ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దు

విశాఖ నుండి వెళ్ళవలసిన పలు విమానాలు రద్దు అయినట్టు శనివారం ఉదయం ఇంచార్జి ఏర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. వాటిలో ఇండిగో సంస్థకు చెందిన 6E 217 / 6E 218 BLR – VTZ – BLR, 6E 5248 / 6E 845 BOM – VTZ – MAA, 6E 557 / 6E 6585 MAA – VTZ – BOM ఆపరేషన్ రీజనల్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 9 విమానాలను రద్దు చేశారు.


