News February 5, 2025

గంటల వ్యవధిలో యువతి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు

image

ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు ఒక యువతి తప్పిపోయినట్లు మంగళవారం ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించి టెక్ సెల్, సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సదరు యువతిని పీఎం పాలెంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంటల వ్యవధిలో తప్పిపోయిన యువతి ఆచూకీ కనుగొన్న ఎంవీపీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.

Similar News

News January 22, 2026

గాజువాక జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్

image

జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఉండగా ఇంజినీరింగ్ విభాగం సెక్షన్ ఇంజినీర్ గోవింద్ రాజు కుప్ప కూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తోటి ఉద్యోగులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 22, 2026

30న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

image

విశాఖ నగరపాలక సంస్థకు ఈ నెల 30న సాధారణ కౌన్సిల్ సమావేశం, ఫిబ్రవరి 4న 2026–27 వార్షిక బడ్జెట్‌కు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రతిపాదనలు పంపారు. రూ.50 లక్షల పనుల అనుమతులపై ఈ నెల 27న స్థాయి సంఘం సమావేశం జరగనుంది. పాలకవర్గ పదవీకాలం మార్చి 18తో ముగియనుండగా, మార్చి 7 తర్వాత కౌన్సిల్ సమావేశాలకు నిబంధనల ప్రకారం అవకాశం లేదు.

News January 22, 2026

విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం

image

విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హోం మంత్రిత్వ శాఖ విశాఖ నగరంలోని మారిక వల్ల సమీపంలోని ఓజోన్ వ్యాలీ లేఔట్‌లో ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది.