News July 7, 2024
గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గంట్యాడ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో గంట్యాడకి చెందిన హరీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Similar News
News October 27, 2025
జిల్లా పోలీస్ కార్యాలయానికి రావొద్దు: VZM SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టమ్’ (PGRS) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం ప్రకటించారు. “మొంథా” తుఫాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదుదారులు ఎవ్వరూ రావద్దని, తుఫాను సమయంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు.
News October 26, 2025
VZM: తుఫాను కంట్రోల్ రూమ్ పరిశీలించిన ప్రత్యేకాధికారి

విజయనగరం జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ఆదివారం పరిశీలించారు. తుఫాన్ సన్నద్ధతపై వివిధ శాఖలపై ముందస్తుగా సమీక్షించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్, ఇతర అధికారులు ప్రత్యేకాధికారికి వివరించారు.
News October 26, 2025
VZM: తుఫాను ఎఫెక్ట్.. ప్రత్యేకాధికారిగా సుభాష్

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. విజయనగరం జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారిగా సుభాష్ను నియమిస్తూ ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాకు చేరుకున్నారు.


