News May 24, 2024
గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి: ఏలూరు డీఈవో

ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈవో అబ్రహం తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 11,500 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే నెం.8121840400కు ఫోన్ చేయాలన్నారు. గంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News February 15, 2025
ప.గో: ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యాన్ని నెరవేర్చాలి..కలెక్టర్

ఇల్లు కట్టుకోవాలనే ప్రతి ఒక్కరి లక్ష్యాన్ని నెరవేర్చేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో పీఎంఏవై-ఎన్టీఆర్ కాలనీ గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాల లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు.
News February 14, 2025
భీమవరం: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్ లో పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి 31 వరకు 10వ తరగతి రెగ్యులర్ వారికి, 17 నుంచి మార్చి 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతాన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 128 కేంద్రాల్లో 24,393 మంది విద్యార్ధులు హాజరవుతారన్నారు.
News February 14, 2025
ప.గో : నామినేషన్లు విత్ డ్రా చేసుకుంది వీరే..

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీలో నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా అధికారులు 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. అందులో 8 మంది విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది బరిలో నిలిచారు. పిల్లంగొళ్ల లీలా నగేశ్, విజయలక్ష్మీ, కవల నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, గండుమోలు బాలాజీ, సత్తి రాజు స్వామి, కోండ్రు చక్రపాణి విత్ డ్రా చేసుకున్నారు.