News December 1, 2024
గండికోటలో టోల్ వసూళ్లు దారుణం: DYFI
గండికోటకు వచ్చే పర్యాటకుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం దారుణమని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ అన్నారు. కడప DYFI జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గండికోట అభివృద్ధికి దాదాపు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే మరోవైపు పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
Similar News
News January 14, 2025
బద్వేల్: సంక్రాంతి పండుగ రోజు విషాదం
బద్వేలు మండలం గుండంరాజుపల్లె సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై నుంచి అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రవికుమార్ విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 14, 2025
నలుగురికి పునర్జన్మనిచ్చిన ప్రొద్దుటూరు వాసి
ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన గోపిరెడ్డి రాజశేఖర్రెడ్డి(53) బ్రెయిన్ డెడ్కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్ ఈనెల 1న బైక్ పైనుంచి పడి అపస్మారక స్థితికి వెళ్లారు. 11 రోజుల చికిత్స అనంతరం వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. దీంతో అతని భార్య శ్రీదేవి అవయవదానానికి సహకరించారు. దీంతో అతని అవయవాలతో నలుగురికి పునర్జన్మను కల్పించారు.
News January 14, 2025
పులివెందులలో జోరుగా కోళ్ల పందేలు
సంక్రాంతి పండగను పురస్కరించుకుని పులివెందులలో తొలిసారి జోరుగా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని ఉలిమెల్ల, మండలంలోని ఈ.కొత్తపల్లి, ఎర్రిపల్లె తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో తొలిరోజే రూ.2 కోట్లకు పందేలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందులలో 8 చోట్ల బరులు ఏర్పాటు చేయగా.. లింగాల మండలంలోనే దాదాపు రూ. 50 లక్షలకు పందేలు జరిగినట్లు సమాచారం.