News January 11, 2026
గండికోటలో నేటి నుంచే..!

గండికోట ఉత్సవాలు నేటి నుంచి 3రోజులు జరగనున్నాయి. హెలికాప్టర్ రైడ్స్, పెన్నా నదిలో బోటింగ్ ఉంది. మంగ్లీ, రామ్ మిరియాల సాంగ్స్‌తో, శివమణి డ్రమ్స్‌తో ఉర్రూతలూగించనున్నాయి. భక్తి గీతాలు, గ్రామీణ కళలు, సంప్రదాయ కార్యక్రమాలు కూడా ఉండనున్నాయి. వీటితో పాటు ప్రాచీన గండికోట కోట, మాధవరాయ స్వామి ఆలయం, ఎర్రరాతి బురుజులు. సూర్యోదయం, సూర్యాస్తమయంలో అక్కడి దృశ్యాలు చూసేయండి.
Similar News
News January 21, 2026
కిషన్ రెడ్డి గారూ ఇది మీ అజ్ఞానమా… లేక: KTR

TG: సింగరేణి స్కామ్‌లో ప్రధాన దోషే CBI <<18916865>>విచారణ<<>> కోరాలని ఆశించడం మూర్ఖత్వం కాదా అని కిషన్ రెడ్డిపై KTR మండిపడ్డారు. ‘సీఎం అక్రమ పద్ధతితో తన బావమరిదికి టెండర్‌ను కట్టబెట్టారు. దొంగే PSకు వచ్చి తనపై విచారణ జరపాలని కోరతాడా? BRS బయటపెట్టిన సింగరేణి స్కామ్‌పై కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి తీరు అలాగే ఉంది. ఇది మీ అజ్ఞానమా లేక రేవంత్‌తో బీజేపీకున్న చీకటి ఒప్పందమా’ అని ప్రశ్నించారు.
News January 21, 2026
జగన్ పాదయాత్ర కామెంట్లపై పార్థసారథి కౌంటర్

AP: పాదయాత్ర చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ ఒకసారి పాదయాత్ర చేస్తే ఏపీ ఎంతో నష్టపోయింది. మరోసారి చేయడం వలన రాష్ట్రం ఏమైపోతుందో. ప్రజలను ఒకసారి మోసం చేయొచ్చు.. మళ్లీ మళ్లీ మోసం చేయడం అసాధ్యం’ అని ఆయన విమర్శించారు. కాగా ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని <<18916311>>జగన్<<>> ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 21, 2026
గణతంత్ర స్ఫూర్తితో వేడుకలకు సిద్ధంకండి: కలెక్టర్

ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఎటువంటి లోడు పాట్లు లేకుండా ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి శకటాల ప్రదర్శన నిర్వహణకు ప్రక్రియ మొదలపెట్టాలన్నారు.


