News February 19, 2025

గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

image

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.

Similar News

News February 26, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,730
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,472
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.

News February 26, 2026

పులివెందుల సీఐ ఇంట్లో భారీగా నగదు

image

ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News February 25, 2026

27న వైవీయూలో జాబ్ మేళా: ప్రిన్సిపల్

image

కడప YVUలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, వైవీయు ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6300125455, 94405 16153 నంబర్లను సంప్రదించాలన్నారు.