News December 5, 2024
గండికోట పర్యాటక అభివృద్ధికి అడుగులు: కలెక్టర్
ప్రపంచ పర్యాటక మ్యాపులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండికోట పర్యాటక అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రం” భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందన్నారు.
Similar News
News February 5, 2025
సింహాద్రిపురంలో పులి పిల్లలు?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో కలకలం రేగింది. మంగళవారం గ్రామంలో పులి పిల్లలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. రెండు పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు కిషోర్ అన్నారు. మరికొందరు కూడా పొదల్లో పులి పిల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
News February 5, 2025
కడపలో మహానాడు స్థలాన్ని పరిశీలించిన మంత్రి
మే లో కడప వేదికగా నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సవిత జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చైతన్యతో పాటు పలువురు నాయకులతో కలిసి మహానాడు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఎంతమంది వస్తారు వారికి తగ్గ ఏర్పాట్ల చేసేలా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వస్తారన్నారు.
News February 4, 2025
నేటి విద్యార్థులే రేపటి పౌరులు: మంత్రి సవిత
నేటి విద్యార్థులే రేపటి భవిభారత పౌరులని, విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో 37వ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సవిత ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.