News August 8, 2024
గండికోట ప్రాజెక్టుకు కృష్ణా జలాలు రాక

గండికోట ప్రాజెక్టుకు ఈనెల 11న కృష్ణాజలాలు రానున్నట్లు జి.ఎన్.ఎస్..ఎస్. సీఈ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. గురువారం గండికోట ప్రాజెక్టును జి.ఎన్.ఎస్.ఎస్ అధికార బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా గండికోట గేట్లను, సొరంగాన్ని వారు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జి.ఎన్.ఎస్.ఎస్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
కులం పేరుతో దూషించిన కేసులో ఇద్దరికి 3 ఏళ్లు జైలు

2019 అక్టోబర్ 11న యర్రగుంట్ల మహాత్మా నగర్లో కులం పేరుతో బంగ్లా రమేష్పై దూషణ, కాళ్లు చేతులతో తన్ని కట్టెలతో కొట్టిన కేసులో ఇద్దరికి కడప 4వ ఏ డీజే కోర్టు 3 ఏళ్లు సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఈ కేసును డీఎస్పీ సూర్యనారాయణ విచారించగా, ప్రత్యేక పీపీ బాలాజీ సమర్థవంతమైన వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు.
News November 7, 2025
సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 7, 2025
తొండూరు: పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లి గడ్డలు

తుఫాన్ వల్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు ఆశనిపాతంలా మారాయ్నారు. నష్టపోయిన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


