News November 1, 2024
గండిపేటకు గోదావరి జలాలు
గండిపేట చెరువుకు గోదావరి నీళ్లు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల్లో టెండర్లను పిలవనుంది. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు కానుండగా.. బాపూఘాట్ని సుందరీకరించనుంది. మూసీ పునరుజ్జీవంలో బాపూఘాట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. బాపూఘాట్ దగ్గర వీటి శుద్ధి ఎస్టీపీలకు రూ.7 వేల కోట్లతో టెండర్లు 3 పిలవనుంది. ఈ మేరకు అధికారులతో సీఎం సమీక్షించారు.
Similar News
News November 16, 2024
సకుటుంబ సర్వేను పరిశీలించిన HYD కలెక్టర్
సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని HYD జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం బేగంపేట్‌లోని మయూరి మార్గ్‌లో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ సోమయ్య, ఎన్యుమరేటర్లతో మాట్లాడి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. అన్ని వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.
News November 16, 2024
HYD: మీ పట్టుదలకు సలాం..! లక్ష్యంపై కసి అంటే ఇదే!
అన్ని బాగున్నా.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రస్తుత రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగిన క్రీడా పోటీల్లో ఏకంగా దివ్యాంగులు బాస్కెట్ బాల్ క్రీడలో సత్తా చాటి వారెవ్వా అనిపించారు. క్రీడాకారుల పట్టుదలను చూసిన ప్రజలు సలాం కొట్టారు. ఇది కదా.. అసలైన పోటీ అంటే, అనుకున్న కల కోసం కాళ్లు లేకున్నా కడదాకా పోరాడుతామని రుజువు చేశారని వారిని అభినందించారు.
News November 16, 2024
HYD: ‘ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి’
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్వార్ కార్యాలయాలను ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కాచిగూడ హోటల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల స్కాలర్‌షిఫ్‌లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని అన్నారు.