News February 19, 2025

గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం

image

HYD గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News March 28, 2025

మెట్రో ఎండీ పదవి కాలం కొనగించే అవకాశం..!

image

నిన్న ప్రభుత్వం టెర్మినేట్ చేసిన వారిలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఉన్నారు. 2016లో రిటైర్డ్ అయిన మెట్రో ఎండీ, ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మరొకసారి ఎక్స్‌టెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది.

News March 28, 2025

HYD: అసైన్మెంట్ గడువు పొడిగింపు

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం జి.రామ్ రెడ్డి దూర విద్యలో UG, PG విద్యార్థులకు అసైన్మెంట్ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. అధికారిక ప్రకటన విడుదల చేసిన అధికారులు, ఇది తుదిగడువు అని స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి సమర్పించని విద్యార్థుల అసైన్మెంట్లు తిరస్కరిస్తామని హెచ్చరించారు. గడువు దాటిన తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

News March 28, 2025

HYD: మీరు ఇందులో నీళ్లు తాగుతున్నారా?

image

RO ప్లాంట్లు HYDలో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కిరాణా షాపుల్లోనూ 20L వాటర్ రూ.15-20కి విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల నీరు తాగడంతో కిడ్నీల సమస్యలు, జట్టురాలడం, గుండె సమస్యలు వస్తాయని రుజువైంది. సోడియం సల్ఫేట్, పొటాషియం వంటి ఖనిజాలు కలిపితేనే మినరల్ వాటర్. RO వాటర్‌లో ఇవన్నీ ఉండవు. నాసీరకం క్యాన్లలో నీరుతాగినా ప్రమాదాన్ని కొనుక్కున్నట్లే. సర్టిఫైడ్ ప్లాంట్లలో, నాణ్యమైన డబ్బాల్లో నీటిని తెచ్చుకోవాలి.

error: Content is protected !!