News February 19, 2025
గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం

HYD గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News March 15, 2025
UPDATE: మనవడి పుట్టినరోజున తాత సూసైడ్

మియాపూర్ PS పరిధిలో వ్యక్తి <<15762457>>ఆత్మహత్యకు<<>> పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘవేందర్ రావు దీప్తిశ్రీనగర్‌లో నివాసముంటున్నారు. శుక్రవారం రాఘవేందర్ రావు మనవడు పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించుకోవాలని కుటుంబ సభ్యులు షాపింగ్‌కు వెళ్లగా అతను ఇంట్లోనే ఉన్నాడు. షాపింగ్ నుంచి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూడగా ఉరేసుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 15, 2025
శంషాబాద్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన RGIA పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. MBNRకు చెందిన బాలిక అదే ప్రాంతానికి చెందిన యువతితో కలిసి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. వికారాబాద్‌కు చెందిన జోసఫ్ రాళ్లగూడలో నివాసముంటూ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
News March 15, 2025
HYD: హత్య కేసును ఛేదించిన పోలీసులు

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.