News September 3, 2024
గండిలో అవి విక్రయిస్తే కఠిన చర్యలు
గండి ఆలయ ప్రాంగణంలో బీడీలు, సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బీడీలు, సిగరెట్లు గుట్కాలు విక్రయించడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే దుకాణదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బీడీలు, సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తున్న దుకాణాలపై కాగా సోమవారం దాడులు నిర్వహించారు.
Similar News
News September 13, 2024
కడప: 108 వాహనాల్లో ఉద్యోగ అవకాశాలు
108 వాహనాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండి BS-3, 4, 6 (టెంపో ట్రావెలర్, టాటా వింగర్)లను చేయగలిగే వారు ఈ ఉద్యోగాలకు అర్హులను వారు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4లోపు దరఖాస్తులు కడప న్యూ రిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్న 108 కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News September 13, 2024
గృహ నిర్మాణాలలో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్
అన్నమయ్య జిల్లాలో గత రెండు వారాలుగా గృహ నిర్మాణాలలో జీరో శాతం స్టేజ్ కన్వర్షన్ ఉన్నవారు వారంలోగా ప్రగతి సాధించాలన్నారు. లక్ష్యసాధనలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల స్థాయి గృహ నిర్మాణ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News September 13, 2024
పులివెందుల: సొంత తమ్ముడిని చంపిన అన్న.. కారణం ఇదే.!
మతిస్థిమితం లేక సొంత తమ్ముడిని <<14090347>>అన్న చంపిన ఘటన<<>> రాయలాపురంలో చోటుచేసుకుంది. పులివెందుల అర్బన్ సీఐ జీవన్ గంగానాథ్ బాబు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాయలాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాబయ్య తమ్ముడు బాబా ఫక్రుద్దీన్‌తో గొడవపడి కోపంలో సమ్మెటతో తమ్ముడిని బలంగా కొట్టి చంపినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు.