News December 1, 2024
గండేపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కర్ణం నాగరత్నం(58) స్వగ్రామం నుంచి తాళ్లూరు గుడికి వచ్చి దర్శనం అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 16, 2025
తూ.గో: గుడ్డుకీ గడ్డు కాలం..భారీగా పడిపోయిన ధర

బర్డ్ ప్లూ దెబ్బకు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. రూ.4.90 గుడ్డు ధర రూ.4.55కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి.ట్రేడర్లు బర్డ్ ఫ్లూ పేరుతో కొంత మేర ధర తగ్గించినట్లు చెబుతున్నారు.
News February 16, 2025
రాజమండ్రి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలి-మాజీ ఎంపీ

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక యువకుడి ప్రాణాలు పోయాయని మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ధ్వజమెత్తారు. స్థానిక గోరక్షణ పేట దగ్గర వాటర్ వర్క్స్ మరమ్మతుల నిమిత్తం రోడ్డుకు అడ్డంగా భారీ పైపు వేసి, రోడ్డు డైవర్షన్ కూడా పెట్టలేదన్నారు. దీంతో బైక్‌పై వెళ్తున్న విజయ్ అనే యువకుడు అర్ధరాత్రి పైపును ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
News February 16, 2025
కొవ్వూరు: ఏడుగురిపై కేసు నమోదు

దొంగతనం చేసి పారిపోతూ కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు ఎస్సై కె.జగన్మోహనరావు తెలిపారు. స్కార్పియోను దొంగతనం చేసి విజయవాడ పారిపోతున్నారనే సమాచారంతో కొవ్వూరు దగ్గర మన్ బ్రిడ్జి టోల్‌ప్లాజా సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాంబాబు, హెచ్‌సీ లక్ష్మీనారాయణలకు చెప్పారు. వారు అడ్డుకునే క్రమంలో రాంబాబును ఢీకొట్టి పారిపోయారు.