News February 12, 2025

గండేపల్లి: బంగారు గొలుసు అపహరించిన వ్యక్తి అరెస్ట్

image

గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మాయి వేషధారణలో మరో వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు విలువ చేసే బంగారు గొలుసు అపహరించాడు. దీనిపై గండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఆ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారని జగ్గంపేట సీఐ వైఆర్‌కె తెలిపారు.

Similar News

News September 18, 2025

VKB: దత్త పీఠాన్ని దర్శించుకున్న స్పీకర్

image

దత్తాత్రేయుడి కటాక్షంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం దుండిగల్‌లోని దత్త పీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక, దైవచింతన అలవర్చుకుంటే చక్కటి జీవితం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

News September 18, 2025

ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. 2025-26లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 260 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు.

News September 18, 2025

వేగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

కోవూరు మండలం వేగూరు పంచాయతీలో పిడుగుపాటుకు గోళ్ల వెంకయ్య మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించారు.