News October 31, 2024
గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి నుంచి జగ్గంపేట స్కూటిపై వస్తున్న భార్యభర్తలు ఇద్దరిని వెనుక నుంచి వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ కింద పడిపోగా ఆమె మీద నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.
Similar News
News January 2, 2026
వంతెనపై బైక్.. గోదావరిలో శవమై తేలిన వేములూరు వాసి!

ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ విషాదాంతమైంది. కొవ్వూరు మండలం వేములూరుకు చెందిన గేల్లా గోవిందప్రసాద్(38) మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. డిసెంబరు 30న ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 31న రోడ్డు కం రైలు వంతెనపై బైకును గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News January 2, 2026
తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.