News October 22, 2024
గండేపల్లి: లారీ డ్రైవర్‌కి 12 ఏళ్ల జైలు శిక్ష
గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో ఒక లారీపై 34 మంది ప్రయాణిస్తూ అందులో 16 మంది మరణించడంతో అజాగ్రత్తగా నడపిన లారీ డ్రైవర్‌కి అప్పటి గండేపల్లి ఎస్సై రజనీ కుమార్ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఛార్జ్‌షీట్ దాఖలు వేసినట్లు ప్రస్తుత సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే సోమవారం ఆ కేసుపై పెద్దాపురం కోర్టు జడ్జి డ్రైవర్‌కి 12 ఏళ్లు జైలు శిక్ష, రూ.12 వేలు జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News November 5, 2024
కోనసీమ అబ్బాయి, కెనడా అమ్మాయి పెళ్లి
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కెనడా అమ్మాయితో సోమవారం అమలాపురానికి చెందిన అబ్బాయితో పెళ్లి జరిగింది. అమలాపురానికి చెందిన మనోజ్ కుమార్ కెనడాకు చెందిన ట్రేసీ రోచే డాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమలాపురం వచ్చిన కెనడా అమ్మాయి బంధువులు పెళ్లి ఇంట సందడి చేశారు. తెలుగు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. ఆ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు.
News November 5, 2024
మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం: పవన్ కళ్యాణ్
యు.కొత్తపల్లి మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో ఆయన ఈ సమస్యలపై ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులను వివరాలు తెలుసుకున్నారు. వారు అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయడం వల్ల మత్స సంపద నశిస్తుందని ఆయన దృష్టికి వచ్చారు. దీనిపై ఫార్మా కంపెనీ అధికారులు, మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు
News November 4, 2024
తూ.గో: మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
తూ.గో.జిల్లాకు చెందిన నాగమణి అనే మహిళ బహ్రెయిన్ వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన లోకేశ్ ఆమెను రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనిపై నాగమణి లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తనను ముగ్గురు ఏజెంట్లు మోసం చేశారని ఆమె వాపోయారు.