News April 24, 2024

గండేపల్లి: వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలు

image

ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు గండేపల్లి పోలీసులు తెలిపారు. 2019 జనవరి 22న గండేపల్లి గ్రామ శివారులో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్, స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టగా.. స్కూటీ చోదకుడు మృతి చెందాడు. ఈ క్రమంలో సోమవారం పెద్దాపురం కోర్టు మెజిస్ట్రేట్ జి.హర్షవర్ధన్ తీర్పు వెల్లడించారు.

Similar News

News September 17, 2025

కలెక్టర్‌కు కీర్తి చేకూరికి ఉద్యమ నోటీసులిచ్చిన సచివాలయ ఉద్యోగులు

image

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక తరఫున జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సచివాలయ ఉద్యోగులు 15 రోజుల ముందస్తు ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయలో ఐక్యవేదిక నాయకులు కలిసి ఈ వినతిని ఇచ్చారు. దడాల జగ్గారావు, కాశీ విశ్వనాథ్, రామాంజనేయులు, నాయుడు, కొల్లి రాజేష్, రామదాసు తదితరులు ఉన్నారు.

News September 17, 2025

రాజమండ్రి: పీఎం ఆవాస్ యోజన బ్రోచర్ ఆవిష్కరణ

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు అక్టోబరు 31 లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలని ఆమె కోరారు.

News September 17, 2025

కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు

image

విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయని కలెక్టర్ తెలిపారు.