News February 12, 2025
గంపలగూడెంలో 11 వేల కోళ్లు మృతి

గంపలగూడెం మండలం అనుములంక గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో గత మూడు రోజుల నుంచి సుమారు 11వేల కోళ్లు మృత్యువాత పడినట్లు యజమాని మంగళవారం తెలిపారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి క్షణాల్లో కళ్ల ముందే కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. కాగా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కొన్ని రోజులపాటు చికెన్కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 9, 2025
మొంథా తూఫాన్ నష్టం నివేదిక అందించండి: మంత్రి పొన్నం

మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నిర్నిత నమూనాలో తుఫాన్ నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని అదేశించాలన్నారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్లు ఎంత మేరకు మరమ్మతులకు అవసరమో తెలుపలాన్నారు.
News November 9, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు బాగుపడేదెన్నడో..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు గుంతలమయంగా మారి, ప్రయాణం నరకంగా మారింది. గతంలో కొందరు నేతలు రోడ్లపైకి వచ్చి గళమెత్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం మినహా క్షేత్రస్థాయిలో రోడ్ల సమస్యకు పరిష్కారం లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతలు పట్టించుకొని రోడ్లను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
News November 9, 2025
మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

జనాబ్ మౌలానా అబుల్ కలాం అజాద్ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.


