News March 15, 2025
గంపలగూడెం: కనుమరుగవుతున్న మామిడి తోటలు

ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు డివిజన్లో మామిడి పండ్లు అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యతుందో మనకి తెలిసిన విషయమే. ఆ డివిజన్లో గంపలగూడెం కూడా ఒక భాగమే. అయితే గంపలగూడెం మండల పరిధిలోని ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల మామిడి తోటలు నరికివేతకు గురయ్యాయి. దీనికి కారణం కోతులు బెడద, పంట చేతికొచ్చే సమయానికి వాతావరణంలో మార్పులు, ఇలా పలు కారణాలు వల్ల మామిడి తోటలు కనుమరుగవుతున్నాయని రైతులు వాపోయారు.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
వరంగల్: ఏడాది గడిచినా వేతనాలు అందని దుస్థితి!

ఇంటింటి కుటుంబ సర్వే పూర్తై ఏడాది గడిచినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు వేతనాలు అందక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 1.79 లక్షల కుటుంబాలపై 1200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు పనిచేశారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రతి దరఖాస్తుకు రూ.30 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినా చెల్లింపులు నిలిచిపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


