News March 15, 2025

గంపలగూడెం: కనుమరుగవుతున్న మామిడి తోటలు

image

ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు డివిజన్లో మామిడి పండ్లు అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యతుందో మనకి తెలిసిన విషయమే. ఆ డివిజన్లో గంపలగూడెం కూడా ఒక భాగమే. అయితే గంపలగూడెం మండల పరిధిలోని ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల మామిడి తోటలు నరికివేతకు గురయ్యాయి. దీనికి కారణం కోతులు బెడద, పంట చేతికొచ్చే సమయానికి వాతావరణంలో మార్పులు, ఇలా పలు కారణాలు వల్ల మామిడి తోటలు కనుమరుగవుతున్నాయని రైతులు వాపోయారు.

Similar News

News April 29, 2025

వినుకొండలో బుల్లెట్ బైకు చోరీ

image

వినుకొండలో దావూద్ హోటల్ ముందు నిలిపిన (AP 39QQ 1408) రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ 650 సీసీ చోరీకి గురైంది. గుర్తు తెలియని యువకుడు హోటల్‌కు వచ్చి టిఫిన్ చేసి కౌంటర్ వద్దకు వచ్చి తనది విజయవాడ అని పరిచయం చేసుకున్నాడు. తనకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టమని, ఓ సారి ట్రైల్ చూస్తానని చెప్పి తీసుకెళ్లినట్లు బాధితుడు రబ్బాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News April 29, 2025

RTCని కనుమరుగు చేసిన కేసీఆర్: జగ్గారెడ్డి

image

RTCని కేసీఆర్ కనుమరుగు చేశారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉచిత బస్సుకు కేసీఆర్ విమర్శిస్తున్నారంటే ఉచిత బస్సు సక్సెస్ అయినట్లేనని తెలిపారు. దీంతో కేసీఆర్‌కు నష్టం కలుగుతుంది కాబట్టే వెస్ట్ అంటున్నారని పేర్కొన్నారు. RTCకి దానికి ప్రాణం పోసిన ఘనత రాహుల్ గాంధీ, అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.

News April 29, 2025

భద్రకాళి ఆలయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

image

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైన బాధితులు ఎవరిని సంప్రదించాలి, 1930 నంబర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం ద్వారా కలిగే నష్టాలను ఎస్ఐ పోచాలు స్థానిక భద్రకాళి దేవాలయంలోని భక్తులకు వివరించారు.

error: Content is protected !!