News September 22, 2024

గంపలగూడెం: కుమారుడిని చంపిన తల్లి.. ఎందుకంటే.?

image

కన్న కొడుకునే తల్లి హత్య చేసిన ఘటన గంపలగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక ఎస్సీ-బీసీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు(39)మద్యానికి బానిసై తల్లిని వికృత చేష్టలతో వేధిస్తుండేవాడు. విసిగిన తల్లి ఈనెల 18న రాత్రి రోకలి బండతో కొడుకు తలపై కొట్టింది. తీవ్ర గాయమైన అతడిని విజయవాడ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ.. శనివారం మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 22, 2024

విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదివే డిగ్రీ విద్యార్థులు(2024-25విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఫీజు, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.

News September 22, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- సికింద్రాబాద్(SC) మధ్య ప్రయాణించే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లు 4 రోజుల పాటు వరంగల్‌లో ఆగవని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12739 VSKP- SC రైలు ఈ నెల 25 నుంచి 28 వరకు, నం.12740 SC-VSKP రైలు ఈ నెల 26 నుంచి 29 వరకు వరంగల్‌లో ఆగవన్నారు. ఆయా తేదీలలో ఈ 2 రైళ్లకు ఖాజీపేటలో ప్రత్యామ్నాయంగా స్టాప్ ఇచ్చామన్నారు.

News September 22, 2024

మహిళా, శిశు సంక్షేమ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

image

కృష్ణా జిల్లా పరిధిలో మహిళా, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన మేనేజర్, పారా మెడికల్ పర్సన్, బ్లాక్ కో-ఆర్డినేటర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ICDS పీడీ ఎస్. సువర్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల దరఖాస్తులను సెప్టెంబర్ 30లోపు కానూరు ఉమాశంకర్ నగర్‌లో ఉన్న మహిళా సంక్షేమ సాధికారత కార్యాలయంలో అందజేయాలన్నారు.