News September 22, 2024
గంపలగూడెం: కుమారుడిని చంపిన తల్లి.. ఎందుకంటే.?
కన్న కొడుకునే తల్లి హత్య చేసిన ఘటన గంపలగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక ఎస్సీ-బీసీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు(39)మద్యానికి బానిసై తల్లిని వికృత చేష్టలతో వేధిస్తుండేవాడు. విసిగిన తల్లి ఈనెల 18న రాత్రి రోకలి బండతో కొడుకు తలపై కొట్టింది. తీవ్ర గాయమైన అతడిని విజయవాడ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ.. శనివారం మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 10, 2024
14న మచిలీపట్నంలో మద్యం టెండర్లు
కృష్ణాజిల్లాకు సంబంధించి ఈ నెల 14న మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో మద్యం టెండర్లు నిర్వహించనున్నట్టు ఉమ్మడి కృష్ణాజిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత టెండర్లు తెరిచే కార్యక్రమాన్ని నోబుల్ కాలేజీలో నిర్వహించాలని నిర్ణయించగా అనివార్య కారణాల వల్ల హిందూ కాలేజీ పీజీ సెంటర్, MBA బ్లాక్ కు మార్చడమైందన్నారు. ఈ మార్పును టెండరుదారులు గమనించాలన్నారు.
News October 9, 2024
విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య సూసైడ్ UPDATE
అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన నాగరాజు మంగళవారం BRTSరోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అతని భార్య ఉష ఉరేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. గుణదల కుమ్మరి బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై భానునగర్ నుంచి పడవలరేవు వైపు రాంగ్ రూట్‌లో వెళుతూ నాగరాజు బైక్‌ను ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఉష పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
News October 9, 2024
జగన్ కుట్రలకు ఫలితమే 11 సీట్లు: ఉమా
తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉండి అనేక అక్రమాలకు పాల్పడిన ఘటనకు ప్రతిఫలంగా ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పది రోజులు విజయవాడలో ఉండి వరద బాధితులను ఆదుకుంటే, ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు.