News January 27, 2025
గంపలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

తెలంగాణలోని వైరా మండలం గౌండ్లపాలెం సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైక్ అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎన్టీఆర్ జిల్లా గంపలడూడెం మండలం పెనుగొలనుకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News February 18, 2025
జగిత్యాల: ‘సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’

బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వ మానవాళికి ఆదర్శమైనదని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల బంజారా భవన్‌లో మంగళవారం జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సంతు సేవాలాల్ బంజారా జాతికే కాదు యావత్ ఇతర కులాలకు ఆదర్శ పురుషుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, డీఈవో రాము తదితరులు పాల్గొన్నారు.
News February 18, 2025
రేపటి నుంచే మెగా టోర్నీ.. గెలిచేదెవరో?

రేపటి నుంచి మార్చి 9 వరకు మెగా క్రికెట్ సమరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మరి ఈ టోర్నీలో విన్నర్స్, రన్నర్స్, అత్యధిక పరుగులు, వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎవరు నిలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. గత టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
News February 18, 2025
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.