News January 24, 2025
గంభీరావుపేట: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 28, 2025
సామాజిక ఉద్యమకారులు జ్యోతిరావు పూలే: మంత్రి పొన్నం

వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు, సామాజిక ఉద్యమకారులు మహాత్మ జ్యోతిరావు పూలే మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడిన దీనజన బాంధవుడు అని కొనియాడారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు మహాత్మ పూలే స్ఫూర్తిగా నిలిచారని కీర్తించారు.

మన్యం: టీచర్స్‌కు ఆటల పోటీలు.. ఎప్పుడంటే?

ఎప్పుడూ ఉద్యోగ బాధ్యతలతో తలమునకలవుతున్న ఉపాధ్యాయులకు ఆటవిడుపు కోసం విద్యాశాఖ ఆటలపోటీలు నిర్వహిస్తుందని మన్యం డీఈవో బి.రాజ్‌కుమార్ తెలిపారు. పురుష టీచర్లకు క్రికెట్, మహిళా టీచర్లకు త్రో బాల్ ఆటల పోటీలు జరుగుతాయన్నారు. మండల స్థాయిలో నవంబర్ 29, 30, డివిజన్ స్థాయిలో డిసెంబర్ 13, 14, జిల్లా స్థాయిలో డిసెంబర్ 20, 21, 22, రాష్ట్రస్థాయిలో జనవరి 2, 3, 4తేదీలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.