News January 24, 2025
గంభీరావుపేట: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2025
గోదావరి జిల్లాల నుంచి వచ్చే చికెన్ తీసుకోవద్దు: కృష్ణా కలెక్టర్

ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లాకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తీసుకోవల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే కోడి మాంసం, కోడి గుడ్లను తీసుకోవద్దన్నారు. జిల్లా సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టామన్నారు.
News February 11, 2025
చీమకుర్తి: తండ్రిపై కొడుకు గొడ్డలితో దాడి

ప్రకాశం జిల్లాలో మంగళవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం బండ్లమూడుకి చెందిన లక్ష్మారెడ్డిపై కొడుకే గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. వెంటనే గ్రామస్థులు అడ్డుకొని 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. తండ్రిపై దాడి చేసిన కుమారున్ని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News February 11, 2025
GNT: ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ సమావేశం

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.