News April 3, 2025

గంభీరావుపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

image

గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బుధవారం బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివంది దేవయ్య(47) తన వ్యవసాయ పొలం వద్ద బావిని పూడిక తీసేందుకు పనులు చేపట్టాడు. పనులు ఎక్కడ వరకు వచ్చాయి అనే క్రమంలో తొంగి చూసే ప్రయత్నం చేయగా అందులో కాలు జారిపడి బావిలో పడడంతోతీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దేవయ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ రాత్రి మృతిచెందాడు.

Similar News

News December 6, 2025

నెలసరి లీవ్స్.. మన రాష్ట్రంలో అమలు చేస్తారా?

image

TG: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య నెలసరి ప్రయోజన బిల్లు-2024(ప్రైవేట్)ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళలకు నెలసరి సమయంలో 4 రోజుల పెయిడ్ లీవ్స్‌తో పాటు బ్రేక్స్, పనిచేసే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, హక్కులు ఉల్లంఘిస్తే కంపెనీలకు భారీగా జరిమానాలు విధించాలని బిల్లు కోరుతోంది. ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఒడిశా ప్రభుత్వాలు ఈ తరహా సెలవులు ఇస్తుండగా తెలంగాణలోనూ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.

News December 6, 2025

BRSపై ఏడుపు తప్ప CM చేసిందేముంది: హరీశ్

image

TG: CM అబద్ధాల ప్రచారంతో వాస్తవాలు మరుగున పడిపోవని, KCR చేసిన సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోరని హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లుగా BRSపై ఏడ్వడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘అనాలోచిత నిర్ణయాలతో SLBCలో 8మంది ప్రాణాలు బలిగొన్నారు. కృష్ణా నీళ్లను AP అక్రమంగా తరలించుకుపోతున్నా, DPRలు రూపొందిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫుట్‌బాల్ ఆటపై ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు.

News December 6, 2025

పెంచలకోనలో విశేష పూజలు

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.