News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్

గచ్చిబౌలి సిద్దిక్నగర్లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 24, 2025
GHMC చరిత్రలో తొలిసారి.. గ్రూప్ ఫొటో

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏండ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ‘ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ గ్రూప్ ఫొటోను కౌన్సిల్ హాల్లో ప్రదర్శింపజేద్దాం. ఈ సంప్రదాయానికి మనమే నాంది పలుకుదాం’ అని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయంపై పాలకవర్గం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
News November 24, 2025
డిసెంబర్ 10 నుంచి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వీక్షించే అవకాశం!

ముచ్చర్ల సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తలుపులు త్వరలో ప్రజల కోసం తెరవనున్నాయి. DEC 8, 9న జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 అనంతరం 10, 11, 12న సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఉంటుంది. తెలంగాణలో ప్రపంచ పెట్టుబడులు చూపడం, రాష్ట్ర విధానాలు, భవిష్యత్తు ప్రాజెక్టులను ప్రదర్శించడం ఈ సదస్సు లక్ష్యం. భారీ భద్రత, నిఘా మధ్య ప్రజలకు ఇబ్బంది లేని ఎంట్రీ, ఎగ్జిట్పై అధికారులు చర్చిస్తున్నారు.
News November 24, 2025
అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి CP సజ్జనార్

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. లంగర్హౌజ్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్కాలనీల్లోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ హెచ్చరించారు.


